తల్లిపాలను కూడా వైసీపీ కల్తీ చేస్తుంది: మంత్రి స్వామి

756చూసినవారు
తల్లిపాలను కూడా వైసీపీ కల్తీ చేస్తుంది: మంత్రి స్వామి
వైసీపీ నేతలు చుక్కపాలు లేకుండా కల్తీ నెయ్యి సృష్టించారని, వారు తల్లిపాలను కూడా కల్తీ చేయగలరని మంత్రి స్వామి ఒక ప్రకటనలో ఆరోపించారు. తప్పులు చేసి ఎదుటివారిపై రుద్దడం వైసీపీ నైజమని ఆయన పేర్కొన్నారు. రసాయనాలతో తయారైన పదార్థాలతోనే నెయ్యి సృష్టించారని స్పష్టంగా తేలినా, సిగ్గులేకుండా బుకాయిస్తున్నారని, శ్రీవారి పవిత్రతను వైసీపీ అపహాస్యం చేసిందని మంత్రి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్