
అన్న క్యాంటీన్ ప్రారంభించాలని డిమాండ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పేదల ఆకలి తీర్చేందుకు నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణం పూర్తయినప్పటికీ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంత పేదలు, కూలీలు కేవలం రూ. 5కే భోజనం చేసే సదుపాయం అందుబాటులో ఉన్నా, తలుపులు తీయకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.


































