
యూనియన్ పోస్టర్ ఆవిష్కరించిన సీఐ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ ఆఫీసులో బుధవారం సీఐ హజరతయ్యా స్థానిక ఆటో వర్కింగ్ యూనియన్ సభ్యుల సమక్షంలో ఆటో యూనియన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, అలాగే మత్తు పదార్థాల తరలింపును అరికట్టడంలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.







































