మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు కాలవలో ఈతకు వెళ్లి ఈశ్వర్ (19) అనే యువకుడు మృతి చెందాడు. తాడివారి పల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్, స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది. ఈశ్వర్ కంభంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈత కొడుతూ నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.