పుల్లలచెరువు మండలంలోని 3 రెవిన్యూ గ్రామాల్లో భూముల రీసర్వే పనులు జరుగుతున్నాయని తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మంగళవారం తెలిపారు. ఈ రీసర్వే రైతుల సమక్షంలోనే జరుగుతుందని, పూర్తయ్యాక వారికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామన్నారు. సర్వే విధానం, అమలు తీరుపై నిరంతర పర్యవేక్షణతో పాటు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. రైతులు సహకరించి ఈ పథకం ప్రయోజనం పొందాలని సూచించారు.