మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం చిన్నారి కట్ల జంక్షన్ వద్ద బుధవారం వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందికి కూడా గాయాలైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.