మార్కాపురం బస్టాండ్ లో అవగాహన కార్యక్రమం

254చూసినవారు
మార్కాపురం బస్టాండ్ లో అవగాహన కార్యక్రమం
మార్కాపురం పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం స్థానిక పోలీసులు మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయించి, అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించడం ద్వారా రక్షణ పొందవచ్చని వివరించారు. వేధింపులపై ఫిర్యాదు చేస్తే వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్