మహిళల భద్రతను లక్ష్యంగా చేసుకుని, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం పోలీసులు 'శక్తి యాప్'పై విస్తృత అవగాహన కల్పించారు. ప్రతి మహిళా తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఆపద సమయంలో లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెనుకాడకుండా ఈ యాప్‌ను ఉపయోగించాలని వారు కోరారు. ఈ యాప్ మహిళలకు అండగా నిలుస్తుందని పోలీసులు తెలిపారు.