మార్కాపురం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు వద్ద మంగళవారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారందరూ వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, లారీ అకస్మాత్తుగా నెమ్మదించడంతో ఈ ప్రమాదం జరిగింది. కలిగిరి నుంచి కనిగిరికి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.