సోమవారం మార్కాపురం మండలంలోని తర్లుపాడు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులు ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న కలెక్టర్ విజయ సునీత ఈ ఘటనను గమనించి, వెంటనే స్పందించి క్షతగాత్రుడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ
ేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ సకాలంలో స్పందించి సహాయం చేసిన తీరును స్థానికులు ప్రశంసించారు.