కాకినాడ ఎమ్మెల్యే పై ఫిర్యాదు

2431చూసినవారు
కాకినాడ ఎమ్మెల్యే పై ఫిర్యాదు
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని మార్కాపురం వైసీపీ ఇన్ ఛార్జ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నానాజీ చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్కాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఎర్రగొండపాలెంలో కూడా ఎమ్మెల్యే తాటిపర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్