మార్కాపురం చెరువు సప్లై ఛానల్ చెత్తాచెదారంతో నిండిపోయి, చిన్న బ్రిడ్జి సమీపంలో నీటిపై పేరుకుపోయింది. దీనివల్ల చెత్త కుళ్లిపోయి అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేసినా ప్రయోజనం లేదని, సంబంధిత సిబ్బంది స్పందించి చెత్తను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.