మార్కాపురంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉన్న ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి భారీ గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి ఫ్లెక్సీలు, పలు రేకులు నేలకూలాయి. వర్షం కారణంగా పట్టణంలో జనజీవనం స్తంభించింది.