మార్కాపురం జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఇటీవల కురుస్తున్న చిరుజల్లులకు భిన్నంగా, ఇలాంటి భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. కొద్ది రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.