ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం, ఫిబ్రవరి 1 నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులకు ఈ పరీక్షలు ఫిబ్రవరి 10 వరకు రెండు స్పెల్స్‌లో జరుగుతాయి. మొత్తం 13,560 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు 9,956 మంది, జువాలజీకి 2,695 మంది, బోటనీకి 2,697 మంది హాజరవుతారు. మొదటి స్పెల్‌లో 61, రెండవ స్పెల్‌లో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రోజూ రెండు పూటలా ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5 గంటల మధ్య నిర్వహిస్తారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. ఆంజనేయులు తెలిపారు.