మార్కాపురం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండును గురువారం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా పరిశీలించారు. పరిసర ప్రాంతాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలానే జిల్లా కేంద్రం కావడంతో అత్యధికంగా ప్రజలు వస్తున్న సందర్భంగా మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని ఆర్టీసీ అధికారులకు జాయింట్ కలెక్టర్ తెలిపారు.