శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో మార్కాపురం జిల్లా ఏర్పడిందని, శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. ఈరోజు గరుడసేవ ప్రారంభమైందని, భక్తులు భారీగా తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామని, అతి త్వరలో వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.