మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారీ వర్షం కారణంగా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం నిలిచిపోయినా, పాఠశాల లైబ్రరీ హాల్‌లో చిన్నారులు యోగాసనాలు వేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ వారు ప్రదర్శన ఇచ్చారు.