జల జీవన్ మిషన్ పనులను పరిశీలించిన మార్కాపురం కలెక్టర్

601చూసినవారు
జల జీవన్ మిషన్ పనులను పరిశీలించిన మార్కాపురం కలెక్టర్
మార్కాపురం మండలం గొట్టిపడియ వద్ద రూ. 1290 కోట్లతో జరుగుతున్న జల జీవన్ మిషన్ పనులను జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం పరిశీలించారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు చేస్తున్న విధానం, పూర్తయిన, చేయాల్సిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఆలస్యం చేయవద్దని సూచించారు.
Job Suitcase

Jobs near you