కుటుంబ కలహాల నేపథ్యంలో మానసిక క్షోభతో తమ్మిశెట్టి వెంకటరమణ (33) అనే మహిళ మార్కాపురం పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గిద్దలూరు మండలం వెంగళరెడ్డిపల్లికి చెందిన ఈమె, భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తూ మానసిక ఇబ్బందులు పడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘోరం జరిగింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.