మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయవద్దు

1చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో, ఈ నిర్ణయం వల్ల పేదలు మెరుగైన వైద్య సేవలను కోల్పోతారని, విద్యార్థులు అధిక ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించాల్సి వస్తుందని పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ రవీంద్రకు వినతి పత్రం సమర్పించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్