మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకే తీసుకువచ్చి ప్రతినెల 1వ తేదీలోపే అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.