ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని పోతవరం గ్రామంలో ఎస్సీ కులస్తులకు చెందిన స్మశాన వాటిక స్థల వివాదాన్ని ఎమ్మార్పీఎస్ నేతలు శుక్రవారం పరిశీలించారు. గతంలో ఈ స్థలంపై వివాదం నెలకొనడంతో స్థానికులు పలుమార్లు కలెక్టర్‌ను కలిసి సమస్య పరిష్కారం కోరారు. సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో, ఎమ్మార్పీఎస్ నాయకులు స్థలాన్ని పరిశీలించి, మరోసారి కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.