మార్కాపురం ABM కాంపౌండ్లో కొండచిలువ, రక్తపింజర్ పాములు కలకలం
By saamreen 4916చూసినవారుమార్కాపురం పట్టణంలోని ABM కాంపౌండ్లో శనివారం రాత్రి ఒకేసారి కొండచిలువ, రక్తపింజర్ పాములు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిగా వచ్చిన ఆయన చాకచక్యంగా పాములను పట్టుకున్నారు. పట్టిన పాములను అడవిలో వదిలివేస్తామని, పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ నిరంజన్ కోరారు. ఈ ఘటనతో స్థానికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు.