మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో నియోజకవర్గ బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, 2026-27 వార్షిక బడ్జెట్‌లో నియోజకవర్గానికి రూ. 679 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందులో సూపర్ సిక్స్ పథకాలకు సుమారు రూ. 317 కోట్లు, అభివృద్ధి పనులకు రూ. 364 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.