త్రిపురాంతకం వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది, పలువురికి గాయాలు

729చూసినవారు
త్రిపురాంతకం వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది, పలువురికి గాయాలు
కాకినాడ జిల్లా నుంచి 33 మంది ప్రయాణికులతో శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాసరావుతో పాటు బాలకోటమ్మ అనే మహిళా ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. బస్సు వేగం తక్కువగా ఉండటంతో కాకినాడ జిల్లాకు చెందిన ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్