మార్కాపురం మండలం గణపవరం గ్రామ సమీపంలో శుక్రవారం పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4, 540 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తూ కేసు నమోదు చేశారు.