ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పట్టణ ఎస్సై సైదుబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ ఒక గంట పాటు ప్రధాన వీధుల్లో స్వయంగా పర్యటిస్తూ ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. శనివారం, ఆయన ఆటోలో తిరుగుతూ ట్రాఫిక్ను అదుపు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పలు కూడళ్లలో వాహనాలకు జరిమానాలు విధించారు.