మార్కాపురం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ పోటీలు మూడు రోజులపాటు ఆరు పండ్లు సైజు విభాగం, న్యూ కేటగిరి విభాగం, సీనియర్ విభాగాలుగా జరుగుతాయని ఆయన తెలిపారు.