పుల్లలచెరువులో తెలుగుదేశం పార్టీ తన 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రేపు ఘనంగా నిర్వహించనుంది. పట్టణ అధ్యక్షులు మేడికొండ అనిల్ కుమార్, ఐటీడీపీ నాయకులు శ్రీనివాసరావు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించి, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.