ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 14వ వార్డులో సోమవారం స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలను వివరిస్తూ, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీలన్నిటిని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, మహిళలకు అత్యధికంగా పథకాలలో సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.