సోమవారం వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన గొట్టిపాడియా గ్రామంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి పర్యటించారు. 7600 కుటుంబాల త్యాగం ఫలితం మరువలేనిదని ఆయన అన్నారు. వెలిగొండ నిర్వాసితుల ఖాతాలలో నగదు జమ అవుతుండడంతో ఆ ప్రాంత ప్రజలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి త్రాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా ఇచ్చారని, రెండు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు తప్పనిసరిగా ఇస్తారని ఆయన హామీ ఇచ్చారు.