జిల్లా ఇస్తే సెటైర్లు వేశారు: ఎమ్మెల్యే నారాయణరెడ్డి

396చూసినవారు
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఓటమి పాలైనా, ప్రజల ఆదరణతో తిరిగి గెలిచి, అందుకు ప్రతిఫలంగా మార్కాపురం జిల్లాను సాధించానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో నీటి సమస్యపై కొనకనమిట్లలో ప్రజలతో కలిసి ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నుంచి 100 కుటుంబాలు తన పార్టీలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్