మార్కాపురం నెక్కంటి రేంజ్‌లోని నెక్కంటి జంగిల్ రైడ్‌ను జులై 1 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఇది పెద్దపులుల సంయోగ సమయం కావడంతో, జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల శాఖ (MoEF&CC) మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శిఖరం నుంచి ఇష్టకామేశ్వరి గూడెం వరకు జంగిల్ రైడ్ అందుబాటులో ఉండదు.