మార్కాపురం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరులో జరగాల్సిన పెళ్లికి వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పెళ్లికుమార్తె అన్నలు అంకాలు(22), నాగేశ్(18), వదిన అలకనంద(18), మేనకోడలు నాగలక్ష్మి(4) అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. పెళ్లి వేడుక విషాదంలో మునిగిపోయింది.