మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు, అక్రమ మద్యం కేసులో బెయిలుపై విడుదలైన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించిన అన్నా వెంకట రాంబాబు, కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.