మార్కాపురం పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టణంలో వ్యర్థాలను తొలగించామని, సప్లై ఛానెల్‌లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాలను తొలగిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో మార్కాపురం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.