
ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంగళవారం మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్లో యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన 2025 డీఎస్సీ నూతన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి ఉపాధ్యాయుడు ఇష్టపడి పాఠాలు నేర్పితే విద్యార్థులు కూడా ఇష్టపడి నేర్చుకుంటారని అన్నారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


































