ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద ఈగల్ టీం పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ డాగ్ రాక్సీ సహాయంతో ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో సుమారు 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీలో సీఐ సుధాకర్, ఎస్సైలు సుదర్శన్, శ్రీరామ్, చెంచయ్య, ఏఎస్ఐ మహబూబ్ బాషా పాల్గొన్నారు.