జరుగుమల్లి మండలంలోని కె.బిట్రగుంటకి తూర్పు వైపున ఉన్న రైల్వే ట్రాక్ పక్కన సుబాబుల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయసు గల మగ మనిషి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న జరుగుమల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహం ఎవరిదో, ఎలా మరణించారనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.