మూడు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

501చూసినవారు
మూడు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 2025-28 మధ్య కాలానికి బార్ల లైసెన్సుల మంజూరుకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి షేక్. ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ, ఒంగోలు మున్సిపల్ పరిధిలో ఒకటి, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 4 సాయంత్రం 6 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్