గేదె అడ్డు రావడంతో ఢీకొట్టిన కారు

3561చూసినవారు
గేదె అడ్డు రావడంతో ఢీకొట్టిన కారు
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొన్న ధాటికి గేదె కూడా తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. తదుపరి ప్రమాదాలు జరగకుండా గేదెను రోడ్డుపై నుంచి తొలగించారు.

సంబంధిత పోస్ట్