కొత్తపట్నం సముద్ర తీరంలో చెన్నై బోట్లు

2291చూసినవారు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వాడరేవు సముద్ర తీరంలో ఆదివారం చెన్నైకు చెందిన ఫిషింగ్ బోట్లు కనిపించడంతో స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన జాలర్లు ఏపీ సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారని, దీనివల్ల తమకు చేపల వేట తగ్గి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని వారు వాపోయారు. మత్స్యశాఖ అధికారులు, కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జాలర్లు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్