వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మద్యం కేసులో బెయిల్ పొందిన తర్వాత, శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఒంగోలులో జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.