న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవనాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి సందర్శించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వారికి పార్లమెంట్ భవనాన్ని దగ్గరుండి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పర్యటనలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.