నాగులుప్పలపాడులోని ఉప్పుగుండూరులో బుధవారం తెల్లవారుజామున ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి వస్తున్న లారీని ఒంగోలు వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు గాయపడిన వారిని 108 వాహనం ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.