ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం 'మహా పాపం నిజం' పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఫ్లెక్సీలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని పామాయిల్, కెమికల్స్ కలిపిన ద్రవంగా పేర్కొన్నారు. ఈ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డు ప్రసాదాలు తయారు చేసి, రూ. 251 కోట్లను దోచుకున్నారని ఆరోపణలు ముద్రించడం చర్చనీయాంశంగా మారింది.