ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు రూడ్సెట్ సంస్థ 31 రోజుల పాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వనుంది. జులై 2వ తేదీ నుంచి ఒంగోలులోని రూడ్సెట్లో ఈ శిక్షణ జరుగుతుంది. 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు అర్హులు. శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించబడతాయి. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్సెట్ను సంప్రదించవచ్చు.