ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఆదివారం ఉదయం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సంతపేటలోని ఓ పాల వ్యాపారి మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.