పేర్నమిట్టలోని వినాయక గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన త్రినాథ్ (30) శనివారం రాత్రి ప్రమాదవశాత్తు రాళ్ల ముక్కల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడు. రాత్రి 7.30 గంటల సమయంలో గ్రానైట్ కటింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలవడంతో స్పృహ తప్పి పడిపోయిన త్రినాథ్‌ను ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మేనల్లుడు సతీష్ ఠాకూర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.